క్రైమ్

ఉంగుటూరులోని హోటల్ లో అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైరింజన్లు!

  • పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరులో ఘటన
  • విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమంటున్న అధికారులు
  • భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఓ హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉంగుటూరులోని కృష్ణసాయి హోటల్ లో ఈరోజు ఉన్నట్టుంటి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ గణనీయంగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం