ఆంధ్రప్రదేశ్జాతీయం

ఈ దాడుల్లో మా హస్తమా ? రామ! రామ!

ఏపీలో ఐటీ దాడుల వెనుక బీజేపీ హస్తముందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొట్టిపారేశారు. ఈ రైడ్స్ కి, తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఏ సంఘటన జరిగినా దానిని తమ పార్టీకి ఆపాదించడం టీడీపీ నేతలకు అలవాటైందని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై కక్ష సాధింపులు ఉండబోవు. అయితే అదే సమయంలో తప్పు చేస్తే  ఎంతటివారికైనా శిక్ష తప్పదు అని నరసింహారావు పేర్కొన్నారు. రాజకీయకక్షతో దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, ఓ స్వతంత్ర సంస్థ జరిపే దాడులకు తమ పార్టీ ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ఇప్పుడు బీజేపీని కూడా అదే రొంపిలోకి దింపాలని ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు.