అంతర్జాతీయం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాస సముదాయం!

వియన్నా:  ప్రపంచంలోనే అతిపెద్ద నివాస సముదాయ విశేషాలేంటో ఒకసారి చూద్దామా.. ‘కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌’  ప్రపంచంలోనే అతిపెద్ద నివాస సముదాయం. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్న ఈ పొడవాటి భవనాన్ని 1927- 1930ల మధ్య కాలంలో నిర్మించారు. అప్పట్లో వియన్నా సోషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ వియన్నా అధీనంలో ఉండేది.  ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్నులు వసూలు చేసి మరీ దీనిని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులకు ఇందులో నివాసాలు కల్పించేందుకు ‘కార్ల్‌ మార్క్స్‌హాఫ్‌’ను నిర్మించారు. అదే ప్రపంచంలోనే అతిపొడవైన నివాస సముదాయంగా చరిత్రలో నిలిచిపోయింది. లోపల అపార్ట్‌మెంట్లు వేటికవే విడిగా ఉన్నా అన్ని ఒకే భవంతిలో ఉండడం విశేషం. కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌ భవనం ఏకంగా 1100 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే కిలోమీటరుకు పైనే మరి. మొత్తం భవనాన్ని అంతా ఒకే ఫొటోలో చూడలేము. ఇందులో దాదాపు 1300లకు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.  ఐదు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

ఈ భవనంలోని ఆఫీసులు, లాండ్రీ, ఆసుపత్రులు, షాపింగ్‌ దుకాణాలు, చిన్న పిల్లలకు నర్సరీల్లాంటివి ఉన్నాయి. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లకు కార్ల్‌మార్క్స్‌ హాఫ్‌ భవనం ప్రసిద్ధి. 1990లో ఒకసారి ఈ భవనానికి మరమ్మతులు చేసి ఆధునికీకరించారు.

akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.
×
akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.