జాతీయం

ఇందిరాగాంధీలా నన్నూ హతమారుస్తారు

దిల్లీ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన తరహాలోనే తనను కూడా అంతమొందించడానికి కుట్ర పన్నుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఏదో ఒక రోజు బిజెపి తనను హత్య చేయిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇందిరా గాంధీని వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంపిన విధంగానే ఏదోక రోజూ నన్నూ హత్య చేస్తారంటూ’ కేజ్రీవాల్‌ సందేహం వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది భాజపాకు చేరవేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తద్వారా ‘ఒక రోజు ఇందిరాగాంధీలాగే నన్నూ వ్యక్తిగత భద్రతా సిబ్బంది హతమారుస్తారని’ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై దాడి చేశాడు. మోతీనగర్లో ఓపెన్‌టాప్‌ జీపులో కేజ్రీవాల్‌ పర్యటిస్తుండగా ఎర్రరంగు టీషర్టు ధరించిన అగంతకుడు ఆప్‌ కార్యకర్తలందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది.