సినిమా

ఆ సినిమా తొలిటికెట్‌ ప్రభాస్‌కే!

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమా తొలి టికెట్‌ను యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సందీప్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ప్రభాస్‌ అన్నను డార్లింగ్‌ అని ఊరికే అనరు. ధన్యవాదాలు అన్నా. మాకోసం సమయం వెచ్చించి చాలా సపోర్ట్‌ చేశావ్‌‌. మీ మాటలు నిజమై మా సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాం. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక నుంచి నేనూ నీకు అఫిషియల్‌ అభిమానినే’ అని పేర్కొంటూ ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘నిను వీడని నీడను నేనే’ సినిమాలో అన్యాసింగ్‌ కథానాయికగా నటించారు. వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు. కార్తిక్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.