జాతీయం

ఆ వదంతులపై దావా వేస్తా: ప్రియాంకా చోప్రా

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా తన భర్త నిక్‌ జొనాస్‌ నుంచి విడాకులు తీసుకోబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘ఓకే’ మ్యాగజైన్‌ వార్తను ప్రచురించింది. పెళ్లి జరిగిన 117 రోజులకే విడిపోతున్నారంటూ ఆర్టికల్‌ రాసింది. ‘ప్రియాంక, నిక్ పని, పార్టీలు, కలిసి సమయం కేటాయించుకోవడం ఇలా ప్రతి విషయంలోనూ గొడవ పడుతున్నారు’ అని రాసుకొచ్చింది. ఈ వదంతుల నేపథ్యంలో సదరు మ్యాగజైన్‌పై దావా వేయాలని ప్రియాంక, నిక్‌ అనుకుంటున్నారట. ప్రియాంక సన్నిహితులు ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్‌కు చెప్పినట్లు సమాచారం. ‘ప్రియాంక నెగిటివ్‌ వదంతుల్ని పట్టించుకోరు. ఈ వార్తలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోమని ప్రియాంక తన బృందానికి సూచించబోతున్నారు. నిక్‌, ప్రియాంకను గత వారం కలిశాం. ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ కొన్ని పత్రికలు మితిమీరి రాస్తున్నాయి’ అని చెప్పారట.