తెలంగాణ

ఆ రెండు పార్టీలు లేకుండా సాధ్యం కాదు: సురవరం

హైదరాబాద్‌: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసినా.. కాంగ్రెస్‌, భాజపా లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…రాజ్యాంగ పరిరక్షణకోసం భాజపాకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి మద్ధతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా భాజపాకు మద్దతు ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటే ఎవరూ నమ్మరని విమర్శించారు. కేసీఆర్‌..భాజపాకు మద్దతుగా ఉన్న పార్టీలను కలవకుండా యూపీఏతో అనుకూలంగా ఉన్న పార్టీలను కలుస్తూ యూపీఏను చీల్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని దుయ్యబట్టారు.బెంగాల్‌లో జరిగిన హింసను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యాసాగర్‌ విగ్రహం పగులగొట్టడమంటే బెంగాల్‌ సంస్కృతిని అవమానించడమేనని సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌, చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌లు బ్లాక్‌ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.