ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సులో రూ.3.47 కోట్ల నగదు గుర్తింపు

ధర్మపురి: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఒక బస్సు కండక్టర్‌ నిజాయితీని చాటుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి బస్సులో మర్చిపోయిన భారీ మొత్తంలో డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించాడు. ఏడు సంచుల్లో ఉన్న రూ.3.47 కోట్ల నగదును బస్సులో గుర్తించిన కండక్టర్‌ తక్షణమే ఎన్నికల అధికారులకు సమాచారం అందించాడు. కండక్టర్‌ సెల్వరాజ్‌ నిజాయితీని అధికారులు అభినందించారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకే నగదు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.