క్రీడలు

ఆటోలో షేన్‌ వాట్సన్‌ చక్కర్లు

చెన్నై: ఈ ఐపీఎల్‌లో ఎంత ఉత్కంఠగా ముగిసిందో అందరికీ తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ అంత రసవత్తరంగా ముగియడానికి కారణం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌. ప్రస్తుతం ఏ నోట విన్నా వాట్సన్‌ మాటే. అతడి మోకాలికి గాయమై రక్తం కారుతున్నా ఆట కొనసాగించడమే ఇందుకు కారణం. చివరికి ఆ జట్టు కప్పు గెలవకపోయినా వాట్సన్‌ మాత్రం అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌ పూర్తవడంతో ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. దీంతో వాట్సన్‌ చెన్నైలో చక్కర్లు కొడుతూ సాంత్వన పొందుతున్నాడు. ఇందులో భాగంగా వాట్సన్‌ తన కుటుంబంతో కలిసి ఆటోలో చెన్నై మొత్తం తిరుగుతున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. వాట్సన్ ప్రయాణించేందుకు ఏసీ కార్లున్నప్పటికీ అతడు మాత్రం ఎంతో నిరాడంబరంగా ప్రయాణిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.