తెలంగాణ

ఆంధ్ర కి ప్రత్యేక హోదా ని కూడా మీరే సాధించండి కెసిఆర్ సారూ……

ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించండి కె.సి.ఆర్….సారు…. కేతిరెడ్డి అభ్యర్థన…….. తెలంగాణ ముఖ్యమంత్రి గా 2 వ సారి ప్రమాణ స్వీకారం నిన్న చేసిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి శుభాకాంక్షలు గురువారం రాత్రి తమిళనాడు తెలుగు యువశక్తి, అధ్యక్షుడు. సినీ నిర్మాత. దర్శకుడు .తమిళనాడు కె.సి.ఆర్ యువసేన గౌరవాధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తమ కార్యవర్గ సభ్యులేన రాకేష్,వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి తెలిపారు అదేవిధంగా కేతిరెడ్డి వారిని మీ ఉద్యమ స్పూర్తితో ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి కొడ నాయకత్వం వహించాలని కె.సి.ఆర్.గారి కోరారు.
తర్వాత ప్రగతి భవన్ వద్ద వెలేకరులతో మాట్లాడుతూ “భారతదేశం ప్రస్తుతం ఉన్న కిష్ట పరిస్థితులలో ఈ దేశానికి కె.సి.ఆర్ గారి లాంటి వారి నాయకత్వం అవసరమని,కె.సి.ఆర్ గారు తీసుకొన్న గుణాత్మకమైన మార్పు నినాదనికి ఒక తెలుగు వాడిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని,ప్రస్తుతం దక్షిణాది లో పోరాట పటిమ ఉన్న నాయకుల లేమి వుందని ,జయలలిత, కరుణానిధి మరణం తర్వాత నేను ఉన్నాను అని ఒక వేలుగు కిరణంలా ముందుకు వచ్చిన కె.సి.ఆర్ గారికి దక్షిణాది ప్రజల మద్దతు ఉంటుందని, ఆయన నినాదమైన గుణాత్మక మార్పు ప్రజల్లో ఎంతో ఉత్సహాన్ని ఇచ్చిందని,అందుకు నిదర్శనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాధించిన విజయమేనని,తెలుగు వాడి సత్తా ను ,దిల్ ను కె.సి.ఆర్ దేశ ప్రజలకు చాటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశ ప్రధాని ఆయన కావటం ఖాయమని, తెలుగు ప్రజలందరూ ఆయన బాట లో నడుచుటకు సిద్ధంగా ఉన్నారని,వారు ఇటీవల చేప్పినట్లు ఒక శక్తివంతమైన ప్రత్యమయ రాజకీయ పార్టీలు లేక పోవడం తో దేశంలో కేవలం కాంగ్రెస్, బి.జె.పి,ప్రభుత్వలకే మొగ్గుచూపుతున్నారని, ఒక నూతన బలమైన నాయకత్వం దేశానికి అవసరమని,దేశప్రజలు కోరుకొంటున్నారని ఆ దిశగా ఆయన విజయం సాదించుతారని ,ఒక చిన్న రాష్టం గా విడిపోయిన తెలంగాణ ను ఎన్నో నూతన పధకాలతో ఈ దేశంలోనే ముందుండే విధంగా తీర్చిదిద్దరని,ఒక విజన్ …ఒక మిషన్ ….ఉన్న నాయకుడు గా కె.సీ.ఆర్ ను కీర్తించక తప్పదని,అందుకు నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవ్వరేన్ని కుట్రలు చేసిన వారి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించరించుటకు ఆయన విధానమే కారణమని ,ముఖ్యంగా జిల్లాలు యెక్కువ చేసి అధికార వికేంద్రీకరణ చేసి లబ్ధిదారులకు అన్ని పధకాలు సక్రమంగా చేరుట0 ఆయన గొప్ప పరిపాలనకు నిదర్శనమని,
60 సంవత్సరల తెలంగాణ ప్రజల కల అయ్యిన తెలంగాణ ను ఆయన ఎలా ఉద్యమ స్పూర్తితో సాధించారో సార్ధరాజకీయలకు బలి అవుతున్న ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమనికి నాయకత్వం వహించి ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా ను సాధించుటకు ఉద్యమాల ముద్ద బిడ్డ….శ్రీ కె.సి.ఆర్ ,కృషి చేయాలని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న 16 కోట్ల మంది తెలుగు వారిని,తెలుగు బాష ను,సాంస్కృతులను కాపాడుటలో ఒక తెలుగు రాష్ట్ర నేత గా మీరు ముందుండి ఎక్కడ తెలుగు వారికి ఎ చిన్న సమస్య వచ్చిన నేను ఉన్నానన్నాను అని ఒక భరోసా కల్గించాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విలేకరుల సమావేశంలో కోరారు…