ఆంధ్రప్రదేశ్

అలెగ్జాండర్‌కు 10 లక్షల సైన్యం ఉంటే.. టీడీపీకి..

కాకినాడ: రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరు వచ్చినా మన విజయాన్ని ఆపలేరని, ఏపీలో జరిగిన సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగలేదని చంద్రబాబు తెలిపారు. ఓట్లు అడిగే హక్కు కేవలం టీడీపీకే ఉందని, రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అలెగ్జాండర్‌కు 10 లక్షల సైన్యం ఉంటే.. టీడీపీకి 65 లక్షల మంది చంద్రబాబులు ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని, జగన్‌ రుణమాఫీ సాధ్యం కాదన్నారు.. మేం చేసి చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు. కాకినాడలో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.