సినిమా

‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌.. ‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌

ముంబయి: తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విజయ్‌ దేవరకొండ పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ట్రైలర్‌లో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లు దించేశారు. ఒరిజినల్‌ సినిమాను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కథలో ఎలాంటి మార్పూ చేయకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఫైటింగ్‌ సన్నివేశాల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. జూన్‌ 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోపక్క తమిళంలోనూ ‘అర్జున్‌ రెడ్డి’ని రీమేక్‌ చేస్తున్నారు. ‘వర్మ’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించారు. విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ కథానాయకుడిగా నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రీషూట్‌ చేస్తున్నారు.