ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి నోచుకోని బీసీ కాలనీ….?

పుల్లలచెరువు (ప్రజా పాలన) పుల్లలచెరువు గ్రామంలో బీసీ కాలనీ ఏర్పడి 34 సంవత్సరాలు కావస్తున్న అభివృద్ధికి నోచుకోని బీసీ కాలనీ పుల్లలచెరువు ఒకానొక టైములో దరిశి నియోజకవర్గం లో ఉండేది అప్పటి గ్రామ సర్పంచి కొలుకులూరి వీరయ్య గ్రామ పెద్ద కొర్లకుంట రాఘవరావు వీరిరువురి కలయకతో ఏర్పడిన బీసీ కాలనీ అప్పటి దర్శి ఎమ్మెల్యే లు నారప్ప శెట్టి శ్రీ రాములు సానికొమ్ము పిచ్చిరెడ్డి ఇరువురిని మెప్పించి వారి హయాంలో బీసీ కాలనీ ఏర్పాటు చేయడం జరిగినది కానీ 1994 వ సంవత్సరము కొలకలూరి వీరయ్య కొర్లకుంట రాఘవరావు వీరి సారధ్యంలో జిల్లా పరిషత్ నిధుల నుండి బీసీ కాలనీలో నివాసముంటున్న ప్రజలకు ఇళ్ల నిర్మాణం కొరకు 50 ఇళ్లను జిల్లా నుంచి తెప్పించిన ఘనత వారిద్దరికీ దక్కుతుంది కానీ ఆ తర్వాత వారిద్దరూ స్వర్గస్తులైనారు తరువాత బీసీ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది అని చెప్పాలి అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా ఎమ్మెల్యేలు ఎందరు మారిన అధికారుల ఎందరో మారిపోయిన ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా మా గోడు వినని అధికారులు ఈ బీసీ కాలనీలో వీధిలైట్లు కరువు సిమెంట్ రోడ్ల కరువు ఈ బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఉన్నది కానీ ప్రభుత్వం నుండి వచ్చు పధకాల మాకు అందట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందిన పుల్లలచెరువు గ్రామంలోని బీసీ కాలనీ అభివృద్ధి చెందేలా అధికారులు చూడాలని బీసీ కాలనీ వాసులు కోరుకుంటున్నారు