తెలంగాణ

అప్పుడే ‘మేడే’కు ఓ అర్ధం ఉంటుంది

హైదరాబాద్‌: కార్మికుల త్యాగం నుంచి పుట్టిన దినం ‘మేడే’ అని అంటున్నారు ప్రముఖ నటుడు నారాయణ మూర్తి. ఈరోజు కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నారాయణ మూర్తి ఓ మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున కార్మికుల త్యాగాల గురించి మనం చెప్పుకోవాలి. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. అది విద్య, వైద్య, రైల్వే ఏదైనా కావచ్చు. అలా అన్నీ ప్రైవేట్‌ కిందికి వెళ్లిపోతే కార్మికులకు రాజ్యాంగంలో ఉన్న హక్కులు పడిపోతాయి. కార్మికుల హక్కులు వారికి దక్కాలంటే ఈ ప్రైవేటీకరణపై పోరాటం జరగాలి. అప్పుడే మేడే అనే పదానికి ఒక అర్థం, ఒక పరమార్ధం ఉంటుంది’ అన్నారు.