క్రైమ్

అత్తాపూర్ లో దారుణహత్య..

హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం జరిగింది. ఫిల్లర్ నెం 145, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికి చంపారు దుండగులు. దాదాపు 100 మీటర్లు వెంటాడి మరి హత్య చేశారు. రక్షించమని మృతుడు ఆర్తనాధాలు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. చంపేసి పారిపోతున్న దుండగులను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మృతుడు రమేష్ గౌడ్ గా తెలుస్తుంది. ఓ హత్య కేసు విషయంలో కోర్టుకు హజరై వస్తుండగా ప్రత్యర్థులు వెంబడించి అతిదారుణంగా హతమార్చారు.

ఈ హత్యలకు పాత కక్ష్యలే కారణంగా తెలుస్తుంది. హత్యకు గురైన రమేష్ శంషాబాద్ ముచ్చింతల్ వద్ద జరిగిన మహేష్ గౌడ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఉదయం రాజేంద్రనగర్ కోర్టుకు హజరై తిరిగి వస్తుండగా మహేష్ గౌడ్ బంధువులు మాటువేసి మరి అతిదారుణంగా హత్య చేసారు.