ఆంధ్రప్రదేశ్

అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి

కర్నూలు : అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. కర్నూలు జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ప్రమాదవశాత్తు ఓ ఎలుగుబంటి పడిపోయింది. గమనించిన అటవీశాఖ సిబ్బంది దానిని కాపాడే ప్రయత్నం చేశారు. వలలతో బయటకు లాగుతున్న సమయంలో ఎలుగు ఒక్కసారిగా ప్రొటెక్షన్‌ వాచర్‌ విజయకుమార్‌పై దాడి చేసి గాయపరిచింది. సిబ్బంది కర్రలతో బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయింది. ప్రమాదంలో గాయపడిన విజయకుమార్‌ను కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.