తెలంగాణ

అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన మాజీ మంత్రి

హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యం పాలైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అబిడ్స్ జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్‌కు కుటుంబ సభ్యులు తీసుకురావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఓటు వేసిన అనంతరం ముఖేష్ గౌడ్‌ను అంబులెన్స్‌లో  ఆస్పత్రికి తరలించారు.