జాతీయం

అండమాన్‌ దిశగా పబుక్‌ తుఫాన్‌..

అండమాన్‌పబుక్‌ తుపాను ఇవాళ సాయంత్రం అండమాన్‌ దీవులను తాకుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో గాలులు గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. ఇవాళ, రేపు అండమాన్‌ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీరాన్ని దాటాక ఉత్తర, ఆగ్నేయంగా ప్రయాణించి తిరిగి ఈశాన్యంవైపు దిశను మార్చుకుని ఈనెల 7, 8 తేదీల్లో మయన్మార్‌ తీరం వైపు వెళ్తుందని అంచనా. 8వ తేదీనాటికి క్రమంగా బలహీనపడుతుంది. మరోపక్క రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం కొనసాగుతుంటాయి.

పబుక్ అంటే భారీ చేప
తుఫాన్లకు ఒక్కో దేశం ఒక్కోసారి పేరు పెడుతున్నది. పబుక్ తుఫాన్‌కు లావోస్ దేశం ఆ పేరు పెట్టింది. పబుక్ అంటే భారీ మంచినీటి చేప అని అర్థం.